ePaper
More
    HomeజాతీయంDelhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం చెల్లిన వాహనాల (ELVలు)కు ఇంధనం అందించకుండా చర్యలను అన్వేషిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi Chief Minister Rekha Gupta) పేర్కొన్నారు. సోమవారం(జూన్​ 30) ఆమె మీడియాతో మాట్లాడారు.

    “ఢిల్లీలో.. సుప్రీంకోర్టు, పొల్యూషన్​ నియంత్రణ సంస్థలు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తదితర సంస్థలు కాలం చెల్లిన వాహనాల (End-Of-Life Vehicles)ను దశలవారీగా తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి” అని గుప్తా గుర్తుచేశారు.

    Delhi : బంకుల వద్ద కెమెరాల ఏర్పాటు..!

    “ఇటువంటి వాహనాలకు ఇంధనం అందించకూడదు. దీనిని సమర్థవంతంగా ఎలా అమలు చేయవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంధన బంకుల వద్ద కెమెరాలను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం” అని గుప్తా తెలిపారు.

    Delhi : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా రెండు ప్రధాన సమస్యలను లేవనెత్తింది. ఢిల్లీలో కాలుష్యం, యమునా నది (Yamuna river) కాలుష్యం.. ఎన్నికైన తర్వాత ఈ రెండింటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచాక ఢిల్లీలోని భాజపా సర్కారు తాజాగా తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి చొరవ తీసుకుంటోంది.

    గతంలో, సీఎం గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ జల్ బోర్డు.. రాజధాని నీటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ట్యాంకర్ సేవలలో పారదర్శకతను పెంచడం, మురుగునీటి నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడం, భారీగా కలుషితమైన యమునా నదిని పునరుద్ధరించడం లక్ష్యంగా 45 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక(45-point action plan)ను రూపొందించింది.

    ఈ మేరకు యమునా నదిలో కాలుష్య పర్యవేక్షణ కోసం మొత్తం 67 ప్రదేశాలను గుర్తించారు. జులై నాటికి సర్వే నిర్వహించి, నివేదికను ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించనున్నారు.

    Latest articles

    IPO | ఐపీవో.. అ‘ధర’హో!.. తొలిరోజే 38 శాతం లాభాలిచ్చిన ‘రీగాల్‌’

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుధవారం రెండు ఐపీవో(IPO)లు లిస్టయ్యాయి. ఒకటి మెయిన్‌బోర్డు(Mainboard)కు...

    Collector Nizamabad | జిల్లాలో ఎరువుల కొరత లేదు..: కలెక్టర్​

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదని కలెక్టర్​...

    Collector Nizamabad | మున్సిపల్​ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దు..: కలెక్టర్​

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | నగరంలో మున్సిపల్​ సిబ్బంది (Municipal staff) విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని...

    Konda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో మళ్లీ బయటపడ్డ విభేదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | వరంగల్​ కాంగ్రెస్​లో (Warangal Congress)​ విభేదాలు చల్లారడం లేదు. గత...

    More like this