551
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mobile Association | నిజామాబాద్ నగరంలోని మొబైల్ షాపుల యజమానులందరూ కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆదివారం నగరంలోని గాండ్ల సంగమ్ (Ganda Sangam)లో మొబైల్ వ్యాపారులందరితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.
మొబైల్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, వ్యాపారుల హక్కులను కాపాడుకోవడానికి సంఘం అవసరం అని వ్యాపారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌లోని ప్రధాన మొబైల్ షాపుల యజమానులు, ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. త్వరలోనే అసోసియేషన్ కార్యవర్గాన్ని (Executive Committee) ఎన్నుకొని, అధికారికంగా సంఘం కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.