అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర పరిశీలకులు శివకృష్ణ గురువారం పర్యటించారు. ప్రభుత్వ పాఠశాల (Government Schools)ల్లో కొనసాగుతున్న ప్రత్యేక పనులు, శుభ్రత, జాగ్రత్తలు తదితర అంశాలను పరిశీలించారు.
మాణిక్ భండార్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల (Manik Bhandar ZPHS School)లో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను కూల్చిన ప్రాంతాన్ని, సైన్స్ ల్యాబ్ గ్రంథాలయాలను సందర్శించారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల సందర్శించి వంటగదిని తనిఖీ చేశారు. విద్యార్థులను అడిగి భోజనం వివరాలు తెలుసుకున్నారు. అలాగే మాక్లూర్, మాదాపూర్ కేజీబీవీలను సందర్శించి పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను ఇతర అంశాల నివేదికలను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) అందజేయనున్నారు. ఆయన వెంట ఎంఈవోలు సత్యనారాయణ గంగాధర్ తదితరులున్నారు.
