అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shruti Haasan | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రాటర్”పై అంచనాలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. రాజమౌళి (Rajamouli) ప్రకటించిన ప్రకారం నవంబర్ 15న బిగ్ రివీల్ ఈవెంట్ జరగనుంది. రామోజీ ఫిలిం సిటీలో (Ramoji Film City) 100 అడుగుల ఎల్ఈడీ స్క్రీన్‌పై ఈ స్పెషల్ ప్రదర్శన కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వారం మొత్తం సినిమా నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయని రాజమౌళి స్వయంగా వెల్లడించారు.
Shruti Haasan | శృతి హాసన్ వాయిస్‌తో ..
ముందుగా విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆయన “కుంభ” అనే పాత్రలో కనిపించనున్నారు. కుంభ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. తాజాగా గ్లోబ్ ట్రాటర్ నుంచి ఫస్ట్ సాంగ్ “సంచారి” విడుదలైంది. ఈ పాటలో ప్రత్యేక సర్ప్రైజ్ ఏమిటంటే, దీనిని పాడింది స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruthi Hassan). సంగీతంపై మంచి పట్టు ఉన్న శృతి హాసన్ గతంలో కూడా పలు చిత్రాల్లో తన స్వరాన్ని వినిపించింది. ఇప్పుడు “గ్లోబ్ ట్రాటర్” కోసం ఆమె తన ఎనర్జీతో పాడిన పాట ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
పాటలోని లిరిక్స్ మహేష్ బాబు క్యారెక్టర్ శక్తి, వేగం, ధైర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.“కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగే లే.. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగే లే, రారా వీరా ధృవ తారా సంచారా..”అంటూ చైతన్య ప్రసాద్ రాసిన ఈ పదాలు అభిమానుల్లో పూనకం తెప్పిస్తున్నాయి. ఈ మ్యూజిక్ మేజిక్ వెనుక ఎం.ఎం.కీరవాణి (M.M.Keeravani) ఉన్నారు. ఆయన అందించిన థీమాటిక్ ట్యూన్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో శృతి హాసన్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడింది. ఇప్పుడు ఈ పాటతో ఆమె గాయనిగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఖాయం. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రాజమౌళి గ్లోబల్ విజన్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
