అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bahubali The Epic Review | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలు తెలుగు సినిమా చరిత్రను మార్చేశాయి.
ఇప్పుడు ఆ రెండు సినిమాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ (Bahubali The Epic) పేరుతో మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. పది సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాను పెద్ద స్క్రీన్‌పై చూడడం అనేది ప్రేక్షకులకు ఎలా అనిపించింది, ఏయే సన్నివేశాలు కత్తిరించారు. రీ క్రియేషన్ (Re-Creation) ఎంత వరకు సక్సెస్ అయింది అనేది చూద్దాం.
కథ..
శివగామి (రమ్యకృష్ణ) మాహిష్మతి రాజ్యం నుంచి ఓ చంటి బిడ్డతో పారిపోవడం నుంచి కథ మొదలవుతుంది. ఆ బిడ్డ మహేంద్ర బాహుబలి (ప్రభాస్), గ్రామంలో “శివుడు”గా పెరుగుతాడు. పెద్దవాడైన తర్వాత జలపాతం దాటి మాహిష్మతికి చేరుకుని దేవసేన (అనుష్క)ని భల్లాలదేవ (రానా) చేతుల నుంచి విముక్తి చేయాలనుకుంటాడు. కానీ శివుడి అసలు పుట్టుక, బాహుబలి కథ, కట్టప్ప ఎందుకు చంపాడు అనే సస్పెన్స్‌లు మళ్లీ మన ముందుకు వస్తాయి.
Bahubali The Epic Review | చిత్రంలో కొత్తదనం ఏంటి?
ఈసారి రెండు సినిమాలను కలిపి 3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌లో కాంపాక్ట్‌గా ఎడిట్ చేశారు. అవంతిక (తమన్నా) లవ్ ట్రాక్, సాంగ్స్, కొంత లాగ్ ఉన్న సీన్స్ మొత్తం కట్ చేశారు. దాంతో కథ మరింత షార్ప్‌గా, పేస్‌తో నడుస్తుంది. ప్రభాస్ ఎంట్రీకి కొత్త సీన్ జత చేశారు. బిజ్జలదేవ (నాజర్) డైలాగ్స్‌తో కూడిన ఆ ఎపిక్ ఎలివేషన్ సీన్ థియేటర్‌లో (Elevation Scene Theater) చప్పట్లు కొట్టించేలా ఉంది. రవిశంకర్ గంభీరమైన వాయిస్‌లో బాహుబలి, భల్లాలదేవ కథను సంక్షిప్తంగా చెప్పిన విధానం బాగా పనిచేసింది. ఎడిటింగ్‌లో కత్తెర వేసిన తీరు చక్కగా ఉంది.
ఇప్పటికే రెండు పార్ట్స్ చూసిన ప్రేక్షకులకు కథ తెలిసినదే కాబట్టి ఆహా, ఈ సీన్ తీసేశారు.. ఇలా ముందుకు వెళ్లిపోయారు” అనుకుంటూ సరదాగా ఫీల్ అవుతారు. అయితే కొత్తగా చూసే వారికి ఫస్ట్ హాఫ్ కొంచెం పొడవుగా అనిపించే అవకాశం ఉంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్పీడ్‌గా, ఎమోషన్‌తో సాగుతుంది. రెండో భాగం రిలీజ్ సమయంలో వచ్చిన గూస్‌బంప్స్ ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో కలిగిస్తాయని చెప్పాలి.
Bahubali The Epic Review | కీరవాణి మ్యూజిక్ మాయ
బాహుబలి రెండు భాగాలకూ, ఇప్పుడు ది ఎపిక్ కూ ప్రాణం పోసింది ఎంఎం కీరవాణి సంగీతమే. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హీరోయిజాన్ని మళ్లీ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆడదాన్ని మీద చెయ్యి వేస్తే…” అంటూ బాహుబలి చెప్పే డైలాగ్ మళ్లీ థియేటర్‌లో అదే హై ఇస్తుంది. కొన్ని సన్నివేశాలు, డైలాగులు క్లుప్తంగా చూపించడమే కొంతమంది ఫ్యాన్స్‌కి ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ మొత్తం ఫ్లోలో మాత్రం సినిమా ఎక్కడా తగ్గలేదు.
Bahubali The Epic Review | టెక్నికల్‌గా రాజమౌళి మ్యాజిక్
టెక్నికల్ పరంగా రాజమౌళి (Rajamouli) అండ్ టీమ్ చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ లెవెల్‌లో మాహిష్మతిని కాస్త కొత్తగా చూపించారు. కొన్ని కొత్త షాట్స్, యాడ్ చేసిన సీన్స్ సినిమా అనుభవాన్ని మరింత రిచ్‌గా మార్చాయి. ‘బాహుబలి: ది ఎపిక్’ అనేది ఒక్క టికెట్‌తో రెండు సినిమాలు చూసిన అనుభూతి. రూ.300కు దాదాపు 3 గంటల 45 నిమిషాల సరికొత్త రీ-రిలీజ్ అనుభవం. మొదటి భాగంలో కొంచెం నిడివి ఎక్కువగా అనిపించినా, సెకండ్ హాఫ్ మొదలయ్యాక మాత్రం కళ్లుచెదిరేలా రాజమౌళి విజన్ ముందుకు సాగుతుంది. కొత్త కథేమీ లేకపోయినా, స్క్రీన్‌ప్లే, ఎమోషన్, యాక్షన్ మళ్లీ అదే మేజిక్ క్రియేట్ చేశాయి.
నటీనటులు : ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ తదితరులు
 దర్శకత్వం : ఎస్ఎస్ రాజమౌళి
 కథ : విజయేంద్ర ప్రసాద్
 నిర్మాత : శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
 సినిమాటోగ్రఫి : సెంథిల్ కుమార్
 ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
 మ్యూజిక్ : కీరవాణి
పాజిటివ్ పాయింట్స్
- రాజమౌళి విజన్ మరోసారి స్క్రీన్‌పై ఫ్రెష్‌గా అనిపిస్తుంది
- ప్రభాస్ & రానా స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ మ్యాజిక్ లాగే ఉంది
- కొత్త ఎడిటింగ్ వల్ల ఎక్కడా ల్యాగ్ లేకుండా సినిమా స్మూత్‌గా సాగుతుంది
- బిజ్జలదేవ – శివుడు ఎంట్రీ సీన్ టాప్ నాచ్
- విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం
పర్ఫార్మెన్స్ చూస్తే..
ప్రభాస్ బాహుబలి, శివుడు పాత్రల్లో మళ్లీ గూస్ బంప్స్ తెప్పించాడు. రానా భల్లాలదేవగా క్లాస్ విత్ మాస్ యాక్టింగ్ చూపించాడు. రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. నటీనటులు అందరు తమ నటనతో అలరించారు.
టెక్నికల్‌గా ది ఎపిక్
కొత్త కలర్ గ్రేడింగ్, DI, సౌండ్ మిక్సింగ్ ఈ వెర్షన్‌కి కొత్త లుక్ ఇచ్చాయి. కొన్ని రాత్రి సీన్స్‌లో గ్రేడింగ్ బాగోలేదనే ఫీలింగ్ వచ్చినా, మిగతా సన్నివేశాలు విజువల్‌గా మెరిసిపోయాయి. ఎడిటింగ్ కచ్చితంగా ఈ సినిమా హైలైట్ అని చెప్పాలి.
చివరిగా..
బాహుబలి ది ఎపిక్ అనేది కేవలం రీ-రిలీజ్ కాదు ఇది ఒక నాస్టాల్జిక్ సెలబ్రేషన్. పదేళ్ల క్రితం మనం అనుభవించిన అదే థ్రిల్, ఎమోషన్, విజువల్ గ్రాండ్యూర్ ఈ వెర్షన్‌లో కూడా ఉంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడదగిన ఎపిక్ అనుభవం ఇది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి పండగే! “పదేళ్ల తర్వాత కూడా ‘బాహుబలి’ మ్యాజిక్ అలాగే ఉంది , రాజమౌళి మళ్లీ గెలిచాడు!

