ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | సీఎస్‌కేతో డూ ఆర్ డై మ్యాచ్.. SRH తుది జట్టు ఇదే!

    IPL 2025 | సీఎస్‌కేతో డూ ఆర్ డై మ్యాచ్.. SRH తుది జట్టు ఇదే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ ipl 2025 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ SRH మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం చెన్నైలోని Chennai చెపాక్ మైదానం chepak stadium వేదికగా జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో CSK అమీతుమీ తేల్చుకోనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చిత్తయిన ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ సీజన్‌లో మిగిలిన 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే SRH ప్లే ఆఫ్స్ చేరుతోంది.

    ఈ క్రమంలోనే ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీకి డూ ఆర్ డై‌గా మారింది. మరోవైపు సీఎస్‌కే CSK పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ జట్టు కూడా ఆరెంజ్ ఆర్మీ తరహాలోనే 8 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    వరుస పరాజయాల నేపథ్యంలో సీఎస్‌కేతో పోరులో సన్‌రైజర్స్ తమ తుది జట్టులో మార్పులు చేయనుంది. రూ. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్‌ Ishan Kishanపై వేటు వేయనుంది. అతను తొలి మ్యాచ్‌లో సాధించిన సెంచరీ మినహా తర్వాతి ఏడు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లోనూ వివాదాస్పద రీతిలో క్రీజును వీడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన అభినవ్ మనోహర్‌‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. చెపాక్ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో రాహుల్‌ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించే అవకాశం ఉంది.

    ముంబైతో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ Mahammad Shami ని తిరిగి జట్టులోకి తీసుకోనున్నారు. దాంతో అతని స్థానంలో ఆడిన జయదేవ్ ఉనాద్కత్‌పై వేటు పడనుంది. ఈ మార్పులు మినహా మిగతా లైనప్ అలానే కొనసాగనుంది.

    IPL 2025 | SRH తుది జట్టు ఇదే:

    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్/అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా

    ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ చాహర్/ స్మరన్ రవిచంద్రన్.

    Latest articles

    Flash Floods | హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షబీభత్సం.. కొట్టుకుపోయిన వంతెనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Flash Floods | ఉత్తర భారత దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉత్తరాఖండ్​లోని...

    Stock Market | ఈసారి నో రేట్‌ కట్‌.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ద్రవ్యోల్బణం(Inflation) తగ్గినా యూఎస్‌ టారిఫ్‌లపై స్పష్టత రాకపోవడంతో ఆర్‌బీఐ((RBI) ఆచితూచి...

    Shubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌.. రోహిత్‌, విరాట్ వ‌న్డేల నుండి కూడా త‌ప్పుకోబోతున్నారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shubhman Gill | టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో మార్పుల‌కు నాంది పలికినట్టే...

    Karimnagar | యూట్యూబ్​లో చూసి భర్త హత్యకు ప్లాన్​.. ప్రియుడితో కలిసి ఘాతుకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karimnagar | ప్రియుడి కోసం భర్త (Husband)లను హత్య చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి....

    More like this