Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ధాన్యంలో మొలకలు.. రైతన్న కళ్లలో నీళ్లు

Banswada | ధాన్యంలో మొలకలు.. రైతన్న కళ్లలో నీళ్లు

అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | వర్షాలు (Rains) రైతులపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే వడ్లు కోసి రోజులు గడుస్తుండగా.. వానలు పడుతుండడంతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ధాన్యం తడిసి కొన్ని చోట్ల మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది.

తమ కష్టార్జిత పంటను రక్షించేందుకు రైతులు 24 గంటలు వడ్ల కుప్పల వద్ద కాపలా కాస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టడం, కుప్పలను సరిచేయాల్సి వస్తోంది. ఇక మరోవైపు మాయిశ్చర్ (తేమశాతం) అధికంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలు (purchasing centers) పంటను కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా పంట చేతికి రాకముందే రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. బీర్కూరు మండలం దామరంచ గ్రామంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతు ధాన్యం కుప్పల వద్ద ఏమీ చేయలేక దీనంగా కూర్చుంటున్నారు. బాన్సువాడ మండలం కొల్లూరు వద్ద రాత్రిపగలు తేడా లేకుండా వరికుప్పల వద్దే నిద్రిస్తున్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.