CP Sai Chaitanya | మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం: సీపీ

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలోని అన్ని విభాగాలకు సంబంధించి క్రికెట్​ పోటీలను (Police Cricket tourney) ఆదివారం ఆయన పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో (Police Parade Ground) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం నిత్యం ఒత్తిడితో కూడుకుని ఉంటుందన్నారు. దీంతో క్రీడల్లో పాల్గొంటే ఒత్తిడికి దూరం కావొచ్చని స్పష్టం చేశారు. సమయం దొరికినప్పుడు తప్పనిసరిగా […]

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలోని అన్ని విభాగాలకు సంబంధించి క్రికెట్​ పోటీలను (Police Cricket tourney) ఆదివారం ఆయన పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో (Police Parade Ground) ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం నిత్యం ఒత్తిడితో కూడుకుని ఉంటుందన్నారు. దీంతో క్రీడల్లో పాల్గొంటే ఒత్తిడికి దూరం కావొచ్చని స్పష్టం చేశారు. సమయం దొరికినప్పుడు తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్, ఆర్మ్​డ్​ రిజర్వ్ విభాగం, అలైడ్ బ్రాంచ్​లు, హోమ్ గార్డ్స్ విభాగాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగాయి. అదనపు డీసీపీ(అడ్మిన్)బస్వారెడ్డి, అదనపు డీసీపీ రామ్ చందర్ రావ్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, పి.శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్​ అధికారి సునీల్​ నాయక్​కు లుకౌట్​ నోటీసులు

ఐపీఎస్​ అధికారి సునీల్​నాయక్​కు ఏపీ పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. ఆయనను అరెస్ట్​ చేయడానిక బీహార్​కు వెళ్లారు.

Anil Ambani ED | ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

Ankit IAS Transfer | నిజామాబాద్​ అదనపు కలెక్టర్ అంకిత్​​ బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.