అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Special Lok Adalat | స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో 4,898 కేసులు రాజీ ద్వారా పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరగాళ్ల (cyber criminals) చేతిలో డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.20,96,406 తిరిగి అందజేయడం జరిగిందని వెల్లడించారు.
Special Lok Adalat | జిల్లావ్యాప్తంగా..
నెల రోజుల నుంచి 15వ తేదీ వరకు జరిగిన స్పెషల్ లోక్ అదాలత్లో (Special Lok Adalat) జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై రాజీపడదగిన కేసులను పరిష్కరించినట్లు సీపీ పేర్కొన్నారు. ఐపీసీ, బీఎన్ఎస్ 372 కేసులు, 111 సైబర్ క్రైం కేసులు (cybercrime cases), 2,064 ఈ-పెట్టి కేసులు, 2,351 డీడీఎంవీ యాక్ట్ కేసులు మొత్తంగా 4,898 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కారమైనట్లు పేర్కొన్నారు.
Special Lok Adalat | పోలీస్ సిబ్బందికి అభినందన..
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ (Police Commissioner) మాట్లాడుతూ స్పెషల్ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి చేసిన సైబర్ క్రైం సిబ్బంది, కోర్టు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి పరిష్కార వేదిక అని సూచించారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చన్నారు.
Special Lok Adalat | సైబర్ పోలీసులు సిద్ధం..
ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు సైబర్ క్రైం డిపార్ట్మెంట్ (Cyber Crime Department) సిద్ధంగా ఉందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో 7 కమిషనరేట్ల పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, ప్రతి జిల్లాలో డీ–4సీని ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాల్లో ఈ స్పెషల్ లోక్ అదాలత్లో 111 సైబర్ క్రైం కేసులను పరిష్కరించామని సీపీ తెలిపారు. అందులో భాగంగా రూ.20,96,406 తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు.
Special Lok Adalat | సైబర్ మోసానికి గురైతే..
ప్రజలెవరైనా సైబర్ మోసాలకు (cyber frauds) గురైతే.. 1930కి కాల్ చేసి చేయాలని.. http://cybercrime.gov.in పోర్టల్లో దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ వై.వెంకటేశ్వర్ రావు, సీఐ ముఖిద్ పాషా, సీసీఆర్బీసీ అంజయ్య, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని సీపీ అభినందించారు.
