అక్షరటుడే, ఆర్మూర్: Macharla Village | ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి (Macharla Village) చెందిన మహిళా సంఘం ఆర్మూర్ అధ్యక్షురాలు స్పందనను గ్రామ సర్పంచ్ కట్ట నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic Day celebrations) సందర్భంగా జాతీయ వేదికపై వందేమాతర గీతాన్ని ఆలపించడంపై హర్షం వ్యక్తం చేశారు.
Macharla Village | తెలంగాణ నుంచి ఇద్దరు మాత్రమే..
ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ.. ఢిల్లీలో రిపబ్లిక్‌డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే వందేమాతరం గీతం (Vande Mataram anthem) ఆలపించే అవకాశం వచ్చిందన్నారు. అందులో మచ్చర్ల గ్రామానికి చెందిన స్పందనకు అవకాశం రావడం గ్రామానికి గర్వకారణమన్నారు. జాతీయ వేదికపై మచర్ల గ్రామానికి చెందిన స్పందన తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించడం గొప్పవిషయమన్నారు.
మచ్చర్లకు గొప్పపేరు..
జాతీయస్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న స్పందన మచ్చర్ల గ్రామానికి గొప్పపేరు తీసుకొచ్చిందని సర్పంచ్ అన్నారు. భవిష్యత్‌లో మరింత మంది మహిళలు ఇలాంటి ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీఎం భూమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నసీర్, మహిళా సంఘ సభ్యులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొని స్పందనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.