ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Southwest Monsoon | తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు..13 రోజులు ముందుగానే తెలంగాణలోకి ఎంట్రీ

    Southwest Monsoon | తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు..13 రోజులు ముందుగానే తెలంగాణలోకి ఎంట్రీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Southwest Monsoon | ఉక్క‌పోతతో అల్లాడిపోతున్న ప్ర‌జ‌ల‌కి చ‌ల్ల‌ని వార్త చెప్పింది వాతావ‌ర‌ణ శాఖ‌ (Meteorological Department). నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

    భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. నైరుతి రుతుప‌వ‌నాలు తెలుగు రాష్ట్రాల‌ని తాకాయ‌ని తెలియ‌జేసింది. తెలంగాణ Telangana , ఆంధ్రప్రదేశ్‌లలోని Andhra Pradesh కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో రుతుపవనాలు మిగతా ప్రాంతాలను కూడా తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకూ భారీ వర్షాలు heavy rains in Telangana and Andhra Pradesh కురిసే అవకాశం ఉందని తెలిపింది.

    Southwest Monsoon | ముందే రాక‌..

    ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని రాయలసీమ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకడంతో ఇవాల్టి నుంచి ఇక మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఈ మూడు రోజులు పాటు వర్షాలు ఇతర జిల్లాల్లోనూ అలాగే కోస్తా ప్రాంతాల్లోనూ ఉంటాయని ఆయన ప్రకటించారు.

    READ ALSO  NTR District | నా చావుకు ఎమ్మెల్యేనే కారణం.. సూసైడ్​ నోట్​ రాసి అదృశ్యమైన ఏఈ

    కేరళ తమిళనాడులో రుతుపవనాల Monsoons రాకతో ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలెర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరి కొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. అటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు ఉంటాయని, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది.

    వాతావరణం(Weather)లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద శనివారం తీరం దాటిన వాయుగుండం, ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని, క్రమంగా తూర్పు దిశగా కదులుతూ ఈరోజు మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

    READ ALSO  National Highways | రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ.. 15 జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం

    దీనికి తోడు అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒడిశా వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అయితే ఉత్తర తెలంగాణ(Telangana)పై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు Heavy Rains కురుస్తాయని. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

    Latest articles

    Scholarships | పెండింగ్​లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Scholarships | పెండింగ్​లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్​షిప్​ విడుదల చేయాలని ఏబీవీపీ (ABVP) జిల్లా...

    KTR | దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుతాం..: కేటీఆర్​

    అక్షరటుడే, లింగంపేట: KTR | రాష్ట్రంలో దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దెదించుతామని బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Supreme Court | ఏపీ, తెలంగాణ‌కు సుప్రీంకోర్టు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు పిటిష‌న్ల కొట్టివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Supreme Court | తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhra Pradesh) రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ...

    BRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్​ కారణంగా తెలంగాణకు (Telangana) జరిగే అన్యాయంపై బీఆర్​ఎస్​వీ ఆధ్వర్యంలో...

    More like this

    Scholarships | పెండింగ్​లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Scholarships | పెండింగ్​లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్​షిప్​ విడుదల చేయాలని ఏబీవీపీ (ABVP) జిల్లా...

    KTR | దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుతాం..: కేటీఆర్​

    అక్షరటుడే, లింగంపేట: KTR | రాష్ట్రంలో దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దెదించుతామని బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Supreme Court | ఏపీ, తెలంగాణ‌కు సుప్రీంకోర్టు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు పిటిష‌న్ల కొట్టివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Supreme Court | తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhra Pradesh) రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ...