Homeజిల్లాలునిజామాబాద్​TNGOs Nizamabad | ఉద్యోగుల ఐక్యతతో సమస్యల పరిష్కారం: టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

TNGOs Nizamabad | ఉద్యోగుల ఐక్యతతో సమస్యల పరిష్కారం: టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

ఉద్యోగులు ఐకమత్యంగా ఉన్నప్పుడే సమస్యలన్నీ సాధించుకునే అవకాశం ఉంటుందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో మెగా సభ్యత్వ నమోదు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: TNGOS Nizamabad | ఉద్యోగులు ఐకమత్యంగా ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో మెగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని (mega membership registration program) నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చొరవతో ప్రతినెలా రూ.700 కోట్లు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరవుతున్నాయని తెలిపారు. ఇందుకు అందరి సహకారం, ఉద్యమ బాటే నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో ముందుకు సాగుతామని చెప్పారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్​ను ప్రారంభించారు. అలాగే పలువురు ఉద్యోగులకు సభ్యత్వ నమోదు చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, శేఖర్, మాజీ అధ్యక్షులు రాజారాం, నరసింహారావు, టీఎన్జీవోస్​ కేంద్ర సంఘ ఉపాధ్యక్షుడు గైని గంగారం, కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటరెడ్డి, నాగరాజు, జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, టీఎన్జీవోస్​ కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సతీష్ కుమార్, సహ అధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, కోశాధికారి దినేష్ బాబు, సునీత, మంజుల, శ్రీనివాస్, మాణిక్యం, జాఫర్ హుస్సేన్, శ్రీ వేణి, పద్మ, విజయలక్ష్మి, ఆయా శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.