Smart Phones | ఈ నెలలో రాబోయే స్మార్ట్ ఫోన్స్ ఇవే.. వీటి ధ‌ర ఎంత‌, ఫీచ‌ర్స్ తెలుసుకుందామా..
Smart Phones | ఈ నెలలో రాబోయే స్మార్ట్ ఫోన్స్ ఇవే.. వీటి ధ‌ర ఎంత‌, ఫీచ‌ర్స్ తెలుసుకుందామా..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Smart Phones | రోజు రోజుకి మార్కెట్‌లో కొత్త ర‌కాల ఫోన్స్ వ‌స్తుండ‌డం, వాటిని కొనే క‌స్ట‌మ‌ర్స్ Customers సంఖ్య పెర‌గ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప‌లు కంపెనీలు కూడా ప్ర‌తి నెల వైవిధ్య‌మైన స్మార్ట్ ఫోన్స్(Smart Phones) మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్, శాంసంగ్, పోకో వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నాయి. మే నెలలో రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను చూస్తే.. ముందుగా శాంసంగ్ గెలాక్సీ(Samsung Galaxy) S25 ఎడ్జ్ ఏప్రిల్‌లో రావొచ్చ‌ని నివేదిక‌లు చెప్పాయి. వచ్చే మేలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్ మే 13న ఉండవచ్చని టాక్ ఉంది.

Smart Phones | వెరైటీ ఫోన్స్..

గెలాక్సీ S25 ఎడ్జ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే(Amoled Display) ఉండ‌నుండ‌గా, ఈ శాంసంగ్ Samsung ఫోన్ అల్ట్రా-స్లిమ్, తేలికపాటి డిజైన్ కలిగి ఉండొచ్చు. 162 గ్రాముల కన్నా తక్కువ బరువు, కేవలం 5.84 మిమీ మందంతో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్లిమ్ డిజైన్(Slim Design) ఉండొచ్చు. ఈ ఫోన్ థిన్ ప్రొఫైల్‌ 25W ఛార్జింగ్ సపోర్టుతో 3,900mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. పోకో F7 ఫోన్ మే నెలలో ప్రపంచవ్యాప్తంగా(Worldwide) లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త పోకో F-సిరీస్ ఫోన్ 16GB వరకు ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇటీవలే భారత మార్కెట్లో ఐక్యూ నియో(iQ Neo) 10Rను లాంచ్ చేసింది. అతి త్వరలో నియో 10 వెర్షన్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. భారత మార్కెట్లో ఐక్యూ నియో 10 మోడల్ కూడా అదే వేరియంట్ కావచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి. లీక్‌ల ప్రకారం.. ఐక్యూ నియో 10 120W ఛార్జింగ్ స్పీడ్ సపోర్టు(Charging speed support)తో పాటు భారీ బ్యాటరీ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫోన్ కావచ్చు. రియల్‌మి GT 7 మేలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. రియల్‌మి Real Me సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్ రాకను ప్రకటించింది. భారత గేమింగ్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ లేటెస్ట్ లైనప్‌లో రియల్‌మి GT 7 ప్రోలో చేరుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్(One Plus) 13s టైమ్‌లైన్ స్పష్టత లేదు. మే 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. వన్‌ప్లస్ 13s అనేది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని ధృవీకరించింది. 6.32-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.