Today gold price | బంగారం కొనాల‌నుకునే వారికి గుడ్ న్యూస్.. ఎంత త‌గ్గిందంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఒక‌సారి భారీగా పెర‌గిన బంగారం ధ‌ర మ‌రో రోజు కాస్త త‌గ్గుతుంది. కొద్ది రోజుల నుంచి బంగారం ఉరుకులు పెట్టింది. ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గుతుంది. గత వారం రోజులుగా బంగారం ధరలలో(Gold price) అంతగా పెరుగుదల కనిపించడం లేదు. ఈ క్ర‌మంలో బంగారం కొనుగోలుపై చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. శుక్రవారం ఉదయం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఒక‌సారి భారీగా పెర‌గిన బంగారం ధ‌ర మ‌రో రోజు కాస్త త‌గ్గుతుంది. కొద్ది రోజుల నుంచి బంగారం ఉరుకులు పెట్టింది. ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గుతుంది. గత వారం రోజులుగా బంగారం ధరలలో(Gold price) అంతగా పెరుగుదల కనిపించడం లేదు. ఈ క్ర‌మంలో బంగారం కొనుగోలుపై చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో(Indian markets) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 22 క్యారెట్ల పసిడి రూ.87,750 ఉండగా.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్(Gold price) రూ.87,740 చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,730 .. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,720 చేరింది.

Today gold price | నిలకడగా బంగారం ధర..

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,720కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర(22 carat gold) రూ.87,740, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్(24 carat gold) రూ.95,720కు చేరింది. ఢిల్లీలో Delhi 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,890, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,587కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720వద్ద కొనసాగుతుంది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,740, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720కు చేరింది.

అలాగే బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720కు చేరింది.కేరళ Kerala, పూణె, వడోదర, అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం అంటే కేవ‌లం ఒక వ‌స్తువు మాత్ర‌మే కాదు, అదొక ఎమోష‌న్‌. ఇంట్లో బంగారం ఉంటే అంద‌రికి ఒక ధీమా ఉంటుంది. అందుకే చాలా మంది బంగారాన్ని కొన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. అక్ష‌య తృతీయ(Akshaya Tritiya) రోజు భారీగా బంగారం కొనుగోళ్లు జ‌రిగాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...