Homeజిల్లాలుకామారెడ్డిSriram Sagar | శ్రీరామ్​ సాగర్​కు స్వల్ప ఇన్​ఫ్లో

Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​కు స్వల్ప ఇన్​ఫ్లో

Sriram Sagar | ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్​ సాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండల్లా ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 9,654 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. కాకతీయ కాలువ (Kakatiya Canal), ఎస్కేప్​ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ (SRSP) దిగువన గల జల విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి చేపడుతున్నారు.

Sriram Sagar | నిజాంసాగర్​ ఒక గేటు ఎత్తివేత

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్​ (Nizam Sagar) ప్రాజెక్ట్​లోకి 4,048 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తంలో నీటితో నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ఒక గేటు ఎత్తి 4,048 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Sriram Sagar | యాసంగికి ఢోకా లేనట్లే

ప్రస్తుతం వానాకాలం వరికోతలు జోరందుకున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో రైతులు యాసంగి సాగు పనులు ప్రారంభించనున్నారు. వానాకాలం సీజన్​ ముగిసే వరకు కూడా ఉమ్మడి జిల్లాలోని రెండు ప్రధాన జలాశయాలైన శ్రీరామ్​ సాగర్​, నిజాంసాగర్​ నిండుకుండల్లా ఉండటంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.