ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | దూసుకొస్తున్న సైలెంట్ విన్నర్.. ఆరో టైటిల్ లోడింగ్!

    IPL 2025 | దూసుకొస్తున్న సైలెంట్ విన్నర్.. ఆరో టైటిల్ లోడింగ్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2025 | ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ శైలి. ఆటలోనే కాదు టైటిల్స్ నెగ్గడంలోనూ ముంబై తీరు ఇదే. తొలి‌ ఐదు సీజన్లలో ఒకసారి మాత్రమే ఫైనల్‌‌ వరకూ వచ్చిన ముంబై ఇండియన్స్.. తర్వాతి 8 సీజన్లలో ఏకంగా ఐదు టైటిల్స్‌‌ నెగ్గింది. తర్వాతి నాలుగేళ్లలో ఒక్క టైటిల్ గెలవలేకపోయిన ముంబై.. ఇప్పుడు ఆరో టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

    తాజా సీజన్‌లోనూ తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. తర్వాతి నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ మొత్తం 5 విజయాలతో పాటు 0.673 రన్‌రేట్‌తో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ముంబై ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదింటిలో మూడు విజయాలు సాధిస్తే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం కానుంది.

    రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం.. బౌలర్లు లయ అందుకోవడంతో ముంబై ఆధిపత్యం కొనసాగిస్తోంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై ఏకపక్ష విజయాలను అందుకుంది. ఐపీఎల్‌లో ఐదేళ్ల తర్వాత వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇలానే ఆరంభంలో చతికిలపడి ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ దూసుకొచ్చి టైటిల్ ఎగరేసుకుపోయింది. తాజా సీజన్‌లోనూ ఆ పరిస్థితులే రిపీట్ కావడంతో ఈ సారి కూడా ముంబై టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సైలెంట్ విన్నర్ దూసుకొస్తుందని ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నారు.

    Latest articles

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    More like this