అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari | జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరిలో ఈత కోసం వెళ్లిన ఏడుగురు యువకులు సెల్ఫీలు దిగుతూ గల్లంతు అయ్యారు. ఏడుగురిలో ఒక యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు. మిగతా ఆరుగురి ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో అంబటిపల్లికి చెందిన నలుగురు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు గుర్తించారు.
