అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Election | రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు(Elections) ఎట్టకేలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) రాణికుముదిని సోమవారం ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించారు.
రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ ఎన్నికలు(ZPTC Elections) జరగనున్నాయి. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించారు.
Local Body Election | నామినేషన్ల తేదీలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే రోజు మొదటి దశ నామినేషన్ల(Nominations) స్వీకరణ ప్రారంభం అవుతుంది. 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ 15 వరకు గడువు ఉంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 23న మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి.
Local Body Election | రెండో దశ..
ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలకు అక్టోబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న నామినేషన్లు పరిశీలించి జాబితా ప్రకటిస్తారు. 19 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 27న పోలింగ్ నిర్వహిస్తారు. మొదటి, రెండో దశ ఎన్నికల ఫలితాలు నవంబర్ 11న విడుదల చేస్తారు.
Local Body Election | మొదటి దశ పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలకు(Panchayat Elections) అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి మొదటి దశ నామినేషన్లు స్వీకరిస్తారు. 19 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 23న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 31న పోలింగ్ ఉంటుంది.
Local Body Election | రెండో దశ
పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్లు అక్టోబర్ 21 నుంచి 23 వరకు సమర్పించడానికి అవకాశం ఉంది. అక్టోబర్ 27న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసి, నవంబర్ 4న ఎన్నికలు నిర్వహిస్తారు.
Local Body Election | మూడో దశ
మూడో దశలో భాగంగా అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 31 వరకు సమయం ఉంది. అదే రోజు మధ్యాహ్నం తర్వాత అభ్యర్థుల ఫైనల్ జాబితా వెలువరిస్తారు. నవంబర్ 8న పోలింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు పోలింగ్ రోజునే విడుదల చేస్తారు.