అక్షరటుడే, వెబ్డెస్క్: Silver prices crash | గత కొన్ని రోజులుగా వాయువేగంతో పెరుగుతున్న వెండి ఒక్కసారిగా క్రాష్ అయింది. ఒక్క రోజులో రూ.60 వేలకు పైగా పడిపోయింది. దీంతో ప్రజలు షాక్ అవుతున్నారు.
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు (Silver prices) అసాధారణ రీతిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వెండి ఆకాశాన్ని అంటేలా పరుగులు పెట్టింది. రికార్డు స్థాయిలో కిలో ఏకంగా రూ.4.20 లక్షలు సైతం చేరింది. శుక్రవారం ఉదయం కిలో రూ.4 లక్షల వరకు పలికిన వెండి సాయంత్రానికి ఢమాల్ మంది. ఏకంగా రూ.60 వేలకు పైగా పడిపోయాయి. ఇండియ బుల్లియన్స్ వెబ్సైట్ ప్రకారం శుక్రవారం సిల్వర్ రేటు కిలోకు రూ.64,290 తగ్గి.. రూ.3,38,200 పలుకుతోంది. ఈ బుల్లియన్ వెబ్సైట్ ప్రకారం.. రూ.66 వేలు తగ్గి రూ.3.40 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు (Gold prices) సైతం రూ.11 వేల వరకు దిగి వచ్చాయి.
Silver prices crash | ఎందుకింత పతనం
వెండి ధరలు (silver rates) ఒక్కరోజులో 15శాతం పడిపోయాయి. ఇంత భారీగా సిల్వర్ రేట్లు ఎందుకు పడిపోయాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, వెండి అమ్మకాలు చేపట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో రేట్లు పడిపోయినట్లు పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వైపు డాలర్ బలపడటంతో రేట్లు దిగి వచ్చాయని మరికొందరు అంటున్నారు. రేట్లు పడిపోవడంతో ప్రజలు మాత్రం అయోమయానికి గురి అవుతున్నారు. రేట్లు మరింత తగ్గుతాయా.. లేదా మళ్లీ పెరుగుతాయా అని ఆలోచిస్తున్నారు. భారీగా తగ్గాయని కొంటే.. మరింత పడిపోతే ఎలా అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెళ్లిలు, ఇతర శుభాకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేసే వారు సైతం వేచి చూసే ధోరణిలో ఉన్నారు.