అక్షరటుడే, ఇందూరు: SGF Sports | స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (School Games Federation) ఆధ్వర్యంలో ఈనెల 22న అండర్ 19, 17, 14 బాల బాలికల అర్చరీ (Archery) టోర్నమెంట్ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి నాగమణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
SGF Sports | కామారెడ్డిలో..
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో దోమకొండ కోటలో (Domakonda Fort) ఎంపికలు ఉంటాయని తెలిపారు. అండర్–19 విభాగంలో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట ఒరిజినల్ పదో తరగతి మెమో తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు కామారెడ్డి ఎస్జీఎఫ్ సెక్రెటరీ హీరాలాల్ను సంప్రదించాలని కోరారు.
SGF Sports | సెపక్తక్రా ఎంపికలు..
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్–14 బాలబాలికల సెపక్తక్రా (Sepaktakraw) ఎంపికలు ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం పోతంగల్ కలాన్ ఉన్నత పాఠశాలలో ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు కామారెడ్డి ఎస్జీఎఫ్ కార్యదర్శి హీరాలాల్ను సంప్రదించాలని కోరారు.