అక్షరటుడే, బోధన్ : Bodhan | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) తమ అనుకూల అభ్యర్థికి ఓటు వేయలేదనే నెపంతో దాడి చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) శనివారం వివరాలు వెల్లడించారు.
బోధన్ సర్కిల్ పరిధిలోని రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో (Veerannagutta Village) గురువారం సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికలలో జమీలుద్దీన్, అప్సర్, హైమద్లు తమ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఇబ్రహీం, వాజీ, అవేష్, అబూబాకర్ కలిసి వారిపై దాడి చేశారు. దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దాడిచేసిన ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైళ్లు, రెండు కత్తులు, ఏడు కర్రలు, ఐరన్ రాడ్, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు (CI Vijay Babu), రెంజల్ ఎస్సై చంద్రమోహన్ (RenJal SI Chandramohan) పాల్గొన్నారు.