అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inspector Transfers | మల్టీ జోన్ –1 (Multi Zone – 1) పరిధిలోని పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మల్టీ జోన్ –1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి (IG Chandrasekhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు.
జోన్ పరిధిలో మొత్తం 10 మంది సీఐలను ట్రాన్స్ఫర్ చేశారు. కరీంనగర్ (Karimnagar) కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేసిన బానోత్ రమేశ్‌ను మహబూబాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న ఆర్ నరేందర్‌ను మల్టీజోన్ –1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నిర్మల్ డీసీఆర్బీలో కొనసాగుతున్న రవీందర్‌నాయక్ నిర్మల్ జిల్లా ముదోల్ సీఐగా వెళ్లనున్నారు. అక్కడ ఉన్న గుమ్మడి మల్లేశ్‌ను జోన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో పని చేస్తున్న తెల్లబోయిన కిరణ్‌ను నిర్మల్ డీసీఆర్బీ (DCRB)కి బదిలీ చేశారు. నిర్మల్ డీసీఆర్బీలో పని చేస్తున్న తాళ్ల సాయికుమార్ బైంసా ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ పని చేస్తున్న గోపీనాథ్‌ను ఐజీపీ (IGP) కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. వెయింటింగ్‌లో ఉన్న పులిగిల్ల నవీన్‌ను వరంగల్ కమిషరేట్‌కు అలాట్ చేశారు. జగిత్యాల వీఆర్‌లో ఉన్న ఎండీ రఫీక్ ఖాన్‌ను కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమించారు. గోదావరి ఖని వన్ టౌన్లో విధులు నిర్వర్తిస్తున్న కేంద్రే రవీందర్‌ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.