అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. నలుగురు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy)ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించింది. 2009 బ్యాచ్‌కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ ప్రస్తుతం మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన రెండేళ్ల పాటు పట్టణ రవాణా సలహాదారుగా కొనసాగనున్నారు.
శ్రుతి ఓజా స్టడీ లీవ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉమెన్ అండ్ చైల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇన్ని రోజులు శ్రీజనకు అప్పగించిన అదనపు బాధ్యతలను తొలగించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న కృష్ణ ఆదిత్యకు TGSWREIS కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. సీతాలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించారు.
హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న కోట శ్రీవత్సకు HMDA కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ స్థానంలో కొనసాగుతున్న ఉపేందర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే చీఫ్ రేషనింగ్ అధికారిగా రాజిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
