అక్షరటుడే, వెబ్‌డెస్క్: Several DSPs Transferred | రాష్ట్రంలో పలువురు డీఎస్పీ, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం 10 మందికి స్థాన చలనం కలిగించిన ఆయన తాజాగా ఐదుగురిని ట్రాన్స్ఫర్ చేశారు.
తెలంగాణ పోలీస్ అకాడమీ (Telangana Police Academy)లో పనిచేస్తున్న ఎస్ సారంగపాణిని రెండు రోజుల క్రితం ప్రభుత్వం కొత్తగూడెం జిల్లా (Kothagudem District) ఇల్లందుకు ట్రాన్స్ఫర్ చేసింది. తాజాగా ఆ బదిలీని రద్దు చేశారు. ఆయనను ఖమ్మం జిల్లా వైరా ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడకు ఇటీవల బదిలీ అయిన పద్మనాబుల శ్రీనివాస్‌ను జీహెచ్ఎంసీ పరిధిలో డీఎస్పీగా నియమించారు.
ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేస్తున్న వెంకన్నబాబును ఇల్లందు డీఎస్పీగా బదిలీ చేశారు. సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ (Cyberabad Special Branch)లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ బి ప్రకాశ్‌ను నిజామాబాద్ ఏసీపీ (Nizamabad ACP)గా పంపించారు. అక్కడ పని చేస్తున్న రాజా వెంకట రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.