- Advertisement -
HomeతెలంగాణRation Shops | రేషన్​ డీలర్ల సంచలన నిర్ణయం.. వచ్చే నెల 3 నుంచి రేషన్​...

Ration Shops | రేషన్​ డీలర్ల సంచలన నిర్ణయం.. వచ్చే నెల 3 నుంచి రేషన్​ షాపులు బంద్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Shops | రాష్ట్రంలో రేషన్​ డీలర్లు (Ration Dealers) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్​ 3 నుంచి దుకాణాలు బంద్​ చేయనున్నట్లు ప్రకటించారు.

తమ డిమాండ్ల సాధన కోసం డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. కమీషన్​ బకాయిలు విడుదల చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కొంతకాలంగా డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు ఆగస్టులో ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌ (Civil Supplies Building) ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల సమ్మె నోటీస్​ (Strike notice) సైతం అందించారు.

- Advertisement -

Ration Shops | బకాయిలు చెల్లించాలి

కమీషన్​ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్​ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్​ దుకాణాలు మూసి వేసి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు తెలిపారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఉపవాస దీక్షలు చేపట్టి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఆరు నెలల కమీషన్​ బకాయిలు రూ.120 కోట్లు, గన్నీ సంచుల డబ్బులు రూ.6 కోట్లు, కేవైసీకి సంబంధించిన రూ.15 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Ration Shops | హామీలు అమలు చేయాలి

ఎన్నికల సమయంలో ​ తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని డీలర్లు చెబుతున్నారు. బకాయిలు విడుదల చేయడంతో పాటు తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. బకాయిలు పేరుకుపోవడంతో దుకాణల అద్దె, హమాలీ కూలి కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలని, కమీషన్​ పెంచాలని కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News