అక్షరటుడే, గాంధారి: Sorghum crops | మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం జిల్లా వ్యవసాయ అధికారులు (agriculture officials), శాస్త్రవేత్తలు కలిసి జొన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జొన్న కంకిలో గింజలు ఏర్పడకపోవడం వంటి సమస్యలు ఉన్న చేన్లను రైతులతో (farmers) కలిసి పరిశీలన జరిపారు.
Sorghum crops | సమస్యను పరిష్కరించాలి..
జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి (Agriculture Officer Mohan Reddy), వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లారెడ్డి సుధా మధుర తదితరులు గుజ్జుల్, చిన్న గుజ్జుల్, దుర్గం, పిస్కుల్గుట్ట తండాలను పరిశీలించారు. ఆయా తండాల శివార్లలో సాగుచేసిన జొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యలకు గల కారణాలను గుర్తించి రైతులకు తెలియజేయాలని శాస్త్రవేత్తలను అధికారులు కోరారు.
Sorghum crops | భవిష్యత్తులో సమస్య రాకుండా..
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ఉషారాణి (ప్లాంట్ బ్రీడింగ్, ఏఆర్ఎస్ కరీంనగర్), అనిల్ రెడ్డి (కో–ఆర్డినేటర్, టీఆర్వీకే మాల్తుమ్మెద), జేకే రేవంత్ (శాస్త్రవేత్త, టీఆర్వీకే మల్తుమ్మెద), మండల వ్యవసాయ అధికారి రాజాలింగం, వ్యవసాయ విస్తరణ అధికారులు కర్ణేశ్వర్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే రైతులు నేనవత్ భీల్సింగ్, సురేందర్, ధూప్సింగ్, ఉరడి సాయిలు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.