అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panchayat Elections | రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి (Sarpanch Candidate) ఆత్మహత్యాయత్నం చేశాడు.
రాస్పల్లి గ్రామంలో (Raspalli Village) రాజయ్య అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేశాడు. అయితే ఓటమి భయంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడు. పంచడానికి తన దగ్గర డబ్బులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు మాట్లాడుతూ.. గ్రామంలో తమ ప్రత్యర్థులు ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బులు పంచారని ఆరోపించారు. దీంతో తన తండ్రి కూడా పొలం అమ్మి డబ్బులు ఇవ్వాలని చూశారన్నారు. అయితే ప్రత్యర్థి వర్గం వారు దానిని అడ్డుకున్నారని చెప్పారు. దీంతో వారు డబ్బులు పంచారని, మనం పంచలేకపోయామని ఆవేదన చెంది తన తండ్రి పురుగుల మందు తాగాడని చెప్పారు.
Panchayat Elections | పలు గ్రామాల్లో ఉద్రిక్తత
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల (Polling Centers) వద్ద ప్రచారం చేస్తున్నారని ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మంచాల మండలం అస్మత్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Panchayat Elections | ఓటు వేయడానికి లండన్ నుంచి..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచి స్వగ్రామాలకు వస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం పల్లెబాట పట్టారు. అయితే ఓ యువకుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి లండన్ (London) నుంచి రావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన లవణ్‌కుమార్ లండన్‌లో ఎంఎస్ చదువుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆయన లండన్ నుంచి వచ్చాడు.