అక్షరటుడే, ఆర్మూర్: Armoor | సక్రాంతి పండుగను సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఈ క్రమంలో పలువురిని ముందుగానే బైండోవర్ చేశారు.
Armoor | ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలో..
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ (Armoor police station) పరిధిలో కోడి పందాలకు సంబంధించి పాత నేరస్థులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ (Armoor SHO Satyanarayana Goud) తెలిపారు. అనంతరం ఆర్మూర్ తహశీల్దార్ సత్యనారాయణ ఎదుట బైండోవర్ చేశామన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు ఆర్మూర్ మండలం ఆలూరు చుట్టుపక్కల గ్రామల్లో ఎవరైనా కోడి పందాలు, జూదం ఆడినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్హెచ్వో తెలిపారు.