ePaper
More
    HomeజాతీయంSanjay Raut | ఆపరేషన్​ సిందూర్​పై సంజయ్​ రౌత్​ సంచలన వ్యాఖ్యలు

    Sanjay Raut | ఆపరేషన్​ సిందూర్​పై సంజయ్​ రౌత్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Sanjay Raut | పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్​ పాకిస్తాన్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్​ సిందూర్(Opertaion Sindoor)​ చేపట్టింది. ఇందులో భాగంగా తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తాజాగా ఆపరేషన్​ సిందూర్​పై శివసేన (యూబీటీ) ఎంపి సంజయ్ రౌత్(MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ విఫలమైందని ఆయన ఆరోపించారు. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదన్నారు.

    ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు(Tourists), ఒక స్థానిక పౌరుడు మృతి చెందాడు. అనంతరం మే 7 భారత్​ పాక్​లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అయితే దీనిపై సంజయ్​ రౌత్​ మాట్లాడుతూ.. అసలు ఆపరేషన్​ సిందూర్​ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది మహిళలను వితంతువులుగా మార్చడంతో ఈ ఆపరేషన్​ చేపట్టారని, కానీ దానికి హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్నారు.పహల్గామ్​లో దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడని రౌత్​ ప్రశ్నించారు. వారు గుజరాత్​లో దాక్కున్నారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్​ ఉగ్రదాడికి హోం మంత్రి అమిత్​ షా నే బాధ్యులని ఆయన అన్నారు.

    Latest articles

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత...

    More like this