Samsung | సామ్‌సంగ్ నుంచి మ‌రో ఖ‌రీదైన ఫోన్‌.. త్వ‌ర‌లోనే మార్కెట్లోకి రానున్న ఎస్‌25
Samsung | సామ్‌సంగ్ నుంచి మ‌రో ఖ‌రీదైన ఫోన్‌.. త్వ‌ర‌లోనే మార్కెట్లోకి రానున్న ఎస్‌25

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Samsung | ప్ర‌ముఖ కొరియ‌న్ కంపెనీ సామ్‌సంగ్ samsung మ‌రో అద్భుత‌మైన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయ‌నుంది. ఇప్ప‌టికే విజ‌య‌వంతమైన గెలాక్సీ ఎస్ సిరీస్‌లో galaxy s series మ‌రో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. అదే ఎస్ 25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్‌(Samsung S25 Edge).

ప్రీమియం సెగ్మెంట్‌లో రానున్న ఈ ఫోన్‌పై అనేక అంచ‌నాలు ఉన్నాయి. అత్యంత సన్నగా ఉండే గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ (Galaxy series smartphone) చివరకు మే 13న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై(Smartphone features) మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో కెన‌డాలో ల‌భ్య‌మ‌య్యే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్(Samsung S25 Edge) ధ‌ర‌ను టిప్ చేసింది. అయితే, ఇది పొర‌పాటున జ‌రిగింద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది.

Samsung | రూ. ల‌క్ష‌కు పైగానే ధ‌ర‌

త్వ‌ర‌లోనే రానున్న గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఫోన్‌(Samsung S25 Edge)లో అధునాత‌న ఫీచ‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ధ‌ర కూడా ల‌క్ష‌కు పైగానే ఉండ‌నున్న‌ట్లు సామ్‌సంగ్ నుంచి వ‌చ్చిన‌ ప్ర‌క‌ట‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. 256 జీబీ, 512 జీబీ వేరియంట్ల‌లో ల‌భ్యం కానున్న ఎస్ 25 ఎడ్జ్ ధ‌ర(Samsung S25 Edge price) రూ. 1,03,267, రూ. 1,14,344గా ఉండ‌నుంది. ఊహించిన దానికంటే ఈ ధ‌ర‌లు చాలా ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా కంటే త‌క్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఈ ధ‌ర‌లు కెన‌డాలో మాత్ర‌మే ఉంటాయ‌ని, భార‌త్‌లోకి వ‌చ్చేస‌రికి మ‌రికొంత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు.

Samsung | ఆక‌ట్టుకున్న ఫీచ‌ర్లు..

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ మే 13న మార్కెట్‌లోకి విడుద‌ల‌య్యే అవ‌కాశ‌మం ఉంది. భార‌త్‌(Bharath)లో మే 30 నాటికి భారత్ మార్కెట్‌(Bharat market)లో లాంచ్ చేయ‌నున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల LTPO OLED 120Hz డిస్‌ప్లేతో 2K రిజల్యూషన్రి, 2700nits వరకు గరిష్ట వెలుతురుతో ఉండ‌నుంది. 12 జీబీ రామ్‌తో రానున్న ఈ గెలాక్సీ సిరీస్ ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా అద్భుత‌మైన మెమొరీని పొందే అవకాశం ఉంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరాలో 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరా ఉంది. అందువల్ల, గెలాక్సీ ఎస్‌25 ఎడ్జ్‌లో శామ్‌సంగ్ సిగ్నేచర్ టెలిఫొటో సామర్థ్యాలు ఉండనున్నాయి.