Homeటెక్నాలజీSamsung Galaxy M17 | శాంసంగ్ గెలాక్సీ M17 భారత్‌లో లాంచ్.. ఏఐ ఫీచర్లతో ఫుల్...

Samsung Galaxy M17 | శాంసంగ్ గెలాక్సీ M17 భారత్‌లో లాంచ్.. ఏఐ ఫీచర్లతో ఫుల్ అప్‌గ్రేడ్ మోడల్

Samsung Galaxy M17 | సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో తన పాపులర్ గెలాక్సీ M సిరీస్‌ను మరింత విస్తరించింది. తాజాగా శాంసంగ్ గెలాక్సీ M17ను ఇండియాలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గెలాక్సీ M16కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samsung Galaxy M17 | స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు శాంసంగ్ ఇండియా మరోసారి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ సౌత్ కొరియా (South Korea) టెక్ బ్రాండ్ శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ M సిరీస్‌లో కొత్త మోడల్ గెలాక్సీ M17‌ను అధికారికంగా భారత్‌లో విడుదల చేసింది. తాజా M17 మోడల్ ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లతో, ప్రత్యేకించి ఏఐ ఫీచర్లు, 50MP కెమెరా, వన్ యూఐ 7, ఆండ్రాయిడ్ 15 వంటి ఆధునిక స్పెసిఫికేషన్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది.

శాంసంగ్ గెలాక్సీ M17 స్పెసిఫికేషన్లు చూస్తే..

డిస్‌ప్లే : 6.7 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే

రిజల్యూషన్ : 1080 x 2340 పిక్సెల్స్, 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

ప్రొటెక్షన్ : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్

ప్రాసెసర్ : ఎక్సినోస్ 1330 చిప్‌సెట్

RAM & స్టోరేజ్ : 4GB / 6GB / 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7

బ్యాటరీ : సమాచారం తెలియాల్సి ఉంది, కానీ శాంసంగ్ మాదిరిగా మంచి బ్యాటరీ లైఫ్ ఆశించవచ్చు

సెక్యూరిటీ & అప్‌డేట్స్ : 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్, 6 OS అప్‌గ్రేడ్‌లు

కెమెరా ఫీచర్లు

  • రేర్ కెమెరా ట్రిపుల్ సెటప్:
  • 50MP ప్రైమరీ సెన్సార్ (OIS‌తో)
  • 5MP అల్ట్రా వైడ్ లెన్స్
  • 2MP మాక్రో లెన్స్

ఫ్రంట్ కెమెరా:

13MP సెల్ఫీ కెమెరా (టీర్‌డ్రాప్ నాచ్‌తో)

  • ఏఐ ఫీచర్లు
  • జెమిని లైవ్
  • సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్
  • AI ఆధారిత కెమెరా ట్యూనింగ్, ఇంటెలిజెంట్ ఫీచర్లు
  • కలర్ ఆప్షన్లు
  • మూన్‌లైట్ సిల్వర్
  • సఫైర్ బ్లాక్

Samsung Galaxy M17 | ధర

4GB + 128GB ₹12,499
6GB + 128GB ₹13,999
8GB + 128GB ₹15,499

లాంచ్ ఆఫర్ : ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్, స్పెషల్ లాంచ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

విక్రయ ప్రారంభం : అక్టోబర్ 13 నుంచి
ఎక్కడ లభ్యం : అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు

బడ్జెట్ ఫోన్ సెగ్మెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ M17, ఆకర్షణీయ స్పెసిఫికేషన్లు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్, మరియు శక్తివంతమైన కెమెరా సెటప్‌తో మార్కెట్లో మంచి పోటీ ఇవ్వనుంది. ప్రత్యేకించి AI ఫీచర్లు, 6 ఏళ్ల అప్‌డేట్ గ్యారంటీ వంటి అంశాలు ఈ ఫోన్‌ను యువతకు మరియు స్మార్ట్‌ఫోన్(Smart Phone) వాడేవారికి రైట్ చాయిస్‌గా మారుతుంది.