అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్లు, సూపర్ హిట్లు అందించిన నటుడిగా మాత్రమే కాకుండా స్టార్డమ్కు నిర్వచనంగా మారిపోయారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2020లో తూర్పు లద్దాక్‌లోని గల్వాన్ లోయ వద్ద భారత్–చైనా (India-China) సైనికుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేశభక్తి, సైనికుల త్యాగం, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సల్మాన్ కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయనకు కొద్దిరోజుల విరామం లభించడంతో అంతర్జాతీయ వేదికపై మెరిశారు.
Salman Khan | నేను పెద్ద నటుడిని కాదు..
సౌదీ అరేబియాలో నిర్వహించిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన సల్మాన్ ఖాన్ అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. వేదికపై మాట్లాడిన ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి చాలా ఓపెన్‌గా స్పందించారు. “గత పాతికేళ్లుగా నేను బయట ప్రశాంతంగా డిన్నర్ చేయలేదు. ఇల్లు, షూటింగ్ లొకేషన్, ఎయిర్‌పోర్టుల మధ్యే నా జీవితం గడిచిపోయింది. మీకు తెలియని విషయం ఏంటంటే.. నేను మీరు అనుకున్నంత ఆనందంగా ఉండను” అంటూ సల్మాన్ భావోద్వేగానికి లోనయ్యారు. స్టార్డమ్ వెనుక దాగి ఉన్న ఒంటరితనం, మానసిక ఒత్తిడిని ఆయన మాటల్లో స్పష్టంగా వెల్లడించారు.
ఇంకా మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన నష్టాలను కూడా గుర్తుచేశారు.“నా ప్రాణ స్నేహితులను చాలామందిని కోల్పోయాను. ఇప్పుడు నిజంగా ‘నా వాళ్లు’ అని చెప్పుకునే నలుగురు మాత్రమే మిగిలారు” అని చెప్పిన సమయంలో వేదికపై ఉన్నవారంతా మౌనంగా ఉండిపోయారు. ఈ వ్యాఖ్యలు అక్కడి ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా భావోద్వేగానికి గురి చేశాయి. అలాగే తన నటనపై కూడా సల్మాన్ సరదాగా, కొంత ఆత్మవిమర్శతో కూడిన వ్యాఖ్యలు చేశారు. “నేను పెద్ద స్టార్ కావచ్చు కానీ గొప్ప నటుడిని కాదు. తోచినట్టే నటిస్తాను. ఎమోషనల్ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు” అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు అభిమానుల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో సల్మాన్‌ను సమర్థిస్తూ అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై సల్మాన్ ఖాన్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ఆయన స్టార్ ఇమేజ్‌కు మరో కోణాన్ని ఆవిష్కరించాయి.