HomeజాతీయంSabarimala Temple | తెరుచుకున్న శబరిమల ఆలయం.. రేపటి నుంచి భక్తులకు దర్శనం

Sabarimala Temple | తెరుచుకున్న శబరిమల ఆలయం.. రేపటి నుంచి భక్తులకు దర్శనం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. సోమవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala Temple | కేరళ (Kerala)లోని శబరిమలలో గల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) ఆలయం ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావడంతో నిర్వాహకులు ఆలయాన్ని తెరిచారు. సోమవారం నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పించనున్నారు.

ప్రతి యేటా అయ్యప్ప ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా భక్తులు స్వామి మాల ధరిస్తున్నారు. మకర విళక్కు సీజన్లో అయ్యప్పను దర్శించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన మండల పూజ సీజన్ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ ఏడాది సైతం భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

Sabarimala Temple | స్పాట్ బుకింగ్​ సౌకర్యం

శబరిమల దర్శనం కోసం ఆన్​లైన్​లో టికెట్​ బుకింగ్​ చేసుకోని వారి కోసం పంపా (Pampa), నీలక్కల్, వండిపెరియార్-సత్రం, చెంగన్నూర్‌లలో స్పాట్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70 వేలు, స్పాట్ బుకింగ్ ద్వారా 20 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. భక్తులు టికెట్లను https://sabarimalaonline.org వెబ్‌సైట్‌లో బుక్​ చేసుకోవాలి. యాత్రికులు గర్భగుడిలో బస చేయడానికి వివిధ భవనాల్లో 540 గదులు ఉన్నాయి. శబరి గెస్ట్ హౌస్‌లో 56 గదులు ఉన్నాయి. అదనంగా 5 కాటేజీలు, 12 వైర్ షెడ్‌లు ఉన్నాయి. వివిధ శాఖ అధికారుల వసతి కోసం 146 గదులు కేటాయించారు.

Sabarimala Temple | దర్శన సమయాలు

ప్రతి రోజు ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకు దర్శనం కోసం తెరుచుకుంటుంది. ఉచ్చ పూజ తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు ఆలయాన్ని మూసి వేస్తారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు తెరుచుకుంటుంది. రాత్రి 11 గంటలకు హరివరాసనంతో దర్శనాలు ముగిస్తారు. రోజుకు 18 గంటలు ఆలయం దర్శనం కోసం తెరిచి ఉంటుంది.

Sabarimala Temple | యాత్రికులకు బీమా

శబరిమల సందర్శించేటప్పుడు గుండె జబ్బుతో మరణించే యాత్రికుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం అందించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఎటువంటి ప్రీమియం లేకుండా వర్చువల్ క్యూలను బుక్ చేసుకునే వారందరికీ రూ. 5 లక్షల ప్రమాద బీమా (Accident insurance)ను వర్తింపచేయనున్నారు. యాత్రికులు మరణిస్తే వారిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి అంబులెన్స్ ఖర్చులను కూడా దేవస్థానం బోర్డు భరిస్తుంది.

Sabarimala Temple | నీలక్కల్​లో పార్కింగ్

యాత్రికుల వాహనాలను నీలక్కల్ ప్రాంతంలో పార్కింగ్​ చేయాలి. . పంప నుంచి నీలక్కల్ 23 కి.మీ దూరంలో ఉంది. నీలక్కల్‌లో 8,500 వాహనాలను పార్క్​ చేయొచ్చు. పంపాలోని హిల్‌టాప్, చక్కుపాలెం వద్ద కొన్ని చిన్న వాహనాలకు పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయి.

Must Read
Related News