అక్షరటుడే, ఇందూరు: RTC Nizamabad | సంక్రాంతి పండుగను (Sankranti festival) పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న (Regional Manager Jyotsna) తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
RTC Nizamabad | 9వ తేదీ నుంచి..
ఈ నెల 9వ తేదీ నుంచి 20 వరకు ఈ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ (Secunderabad to Nizamabad), ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి వరకు, అలాగే తిరుగు ప్రయాణంలో కూడా అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్–1 డిపో నుంచి 96, నిజామాబాద్–2 డిపో నుంచి 53, ఆర్మూర్‌లో 94, బోధన్‌లో 86, బాన్సువాడలో 74, కామారెడ్డి నుంచి 94, మొత్తం 500 బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.