Homeటెక్నాలజీBSNL | రూ. 485కే 80 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ రీఛార్జ్ ప్లాన్‌

BSNL | రూ. 485కే 80 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ రీఛార్జ్ ప్లాన్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: BSNL | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వినియోగదారులను ఆకర్షించేందుకు చౌక ధరలలో రీఛార్జ్​ ప్లాన్ల(Recharge plans)ను తీసుకువస్తోంది. రూ. 485లకే 80 రోజులపాటు అపరిమిత కాలింగ్‌తో పాటు రోజూ 2 GB డాటాను అందిస్తోంది. రూ. 897కు ఆరునెలల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ల గురించి తెలియక, సరైన ప్రచారం లేక చాలా మంది వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. ఆయా ప్యాక్‌ల వివరాలు తెలుసుకుందామా..

గతేడాది ఎయిర్‌టెల్‌(Airtel), జియో, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు టారిఫ్‌లను భారీగా పెంచాయి. ఆ సమయంలోనూ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) రీఛార్జ్​ రేట్లను పెంచలేదు. మరోవైపు ప్రైవేట్‌ రంగ టెల్కోలు(Telco Validity) మరోసారి రేట్లను పెంచడానికి సిద్ధమవుతుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం దానికి దూరంగా ఉంటోంది. చౌక ప్లాన్‌లను అలాగే కొనసాగిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, ఎక్కువ డేటా కావాలనుకునే వారి కోసం రూ. 485 ప్లాన్‌ను అందిస్తోంది.

ఈ ప్లాన్‌ ద్వారా 80 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే రోజుకు 2 జీబీ డాటా, ప్రతిరోజూ వంద ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ (Unlimited voice calls) చేసుకోవచ్చు. రోజువారీ 2GB డేటా పూర్తయిన తర్వాత 40 కేబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. దాదాపు ఇదే ప్లాన్‌ ధర రిలయన్స్‌ జియో(Jio)లో రూ. 859గా ఉంది. ఈ ప్యాక్‌లో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

దాదాపు ఇదే ఛార్జీలతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆరు నెలల (180 రోజులు) వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తోంది. రూ. 897 తో రీఛార్జ్​ చేసుకుంటే 180 రోజుల వ్యాలిడిటీతోపాటు రోజూ 2 జీబీ డాటా, ప్రతి రోజూ వంద ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌(Voice calling) వర్తిస్తాయి. ఇలా కస్టమర్లకు చౌక ప్లాన్లను అందిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ప్రైవేట్‌ సంస్థలకు పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇంకా అన్ని ప్రాంతాలలో 4G సేవలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రతికూలాంశం. 4జీ, 5జీ నెట్‌వర్క్‌(Network)ల విస్తరణను వేగవంతం చేస్తే చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లే అవకాశాలుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దిశగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ అడుగులు వేయాలని కోరుతున్నారు.