Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Road Safety Tax | వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్​లో జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనాల రేట్లు భారీగా తగ్గాయి. పలు వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో రేట్లు దిగి వచ్చాయి. దీంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రేట్లు పెరగనున్నాయి.

Road Safety Tax | మార్చి 1 నుంచి..

కొత్త వాహనాలపై మార్చి 1 నుంచి రహదారి భద్రత పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల రకాలను బట్టి ఈ పన్ను రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండనుంది. ఇది వినియోగదారులపై పడనుంది. దీంతో రేట్లు పెరుగుతాయి. కొత్తగా విధించే ఈ పన్నుతో రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) ఉత్తర్వులు జారీ ఏసింది. రోడ్డు భద్రతను మెరుగు పర్చడానికి ఈ పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Road Safety Tax | పన్ను రేట్లు ఇలా..

ద్వి చక్ర వాహనాలపై రూ.రెండు వేల పన్ను విధించనున్నారు. తేలికపాటి వాహనాలపై రూ.5 వేలు, ఇతర వాహనాలపై రూ.10 వేల ట్యాక్స్​ అమలు చేయనున్నారు. కార్లు తేలికపాటి వాహనాల పరిధిలోకి రానుండగా.. 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోలు ఇతర వాహనాల పరిధిలోకి వస్తాయి. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.