Homeజిల్లాలుకామారెడ్డిYellareddy Mandal | తిమ్మారెడ్డికి రోడ్డు మార్గం పునరుద్ధరణ

Yellareddy Mandal | తిమ్మారెడ్డికి రోడ్డు మార్గం పునరుద్ధరణ

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mandal | భారీ వర్షాలకు మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ (Thimmareddy village) ప్రధాన రహదారి దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయమై స్థానికులు, కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే మదన్మోహన్‌ రావు (MLA Madanmohan Rao) దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ రజిత వెంకట్రాం రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామెల్, మాజీ ఎంపీటీసీ షేకావత్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.