అక్షరటుడే, వెబ్డెస్క్ : Actress Richa Chadha | బాలీవుడ్ నటి రిచా చద్దా తల్లి అయిన తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ షూటింగ్కు వెళ్లిన సందర్భంగా ఆమె తన కూతురి తొలి ఫోటోను షేర్ చేస్తూ, గర్భధారణ సమయంలో ఎదుర్కొన్న శారీరక–మానసిక వేదనతో పాటు సినీ పరిశ్రమ (Film Industry)లో తాను అనుభవించిన నమ్మక ద్రోహాలను బహిర్గతం చేసింది.
ఇటీవల భర్త అలీ ఫజల్ (Ali Fazal)తో కలిసి మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పిన రిచా చద్దా, మేకప్ వేసుకుని మళ్లీ కెమెరా ముందుకు వెళ్లిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక సుదీర్ఘ నోట్ రాసింది. తల్లిగా మారిన తర్వాత తన ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో వివరించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Actress Richa Chadha | “క్షమిస్తాను.. కానీ మర్చిపోలేను”
“నేను త్వరగా పనిలోకి తిరిగి రావాలని అనుకున్నాను. కానీ నా శరీరం, నా మనస్సు అందుకు సహకరించలేదు. డెలివరీ తర్వాత వచ్చే శారీరక, మానసిక సమస్యలతో పాటు వృత్తిపరంగా ఎదురైన నమ్మక ద్రోహాలు నన్ను తీవ్రంగా బాధించాయి” అని రిచా పేర్కొంది. ఇండస్ట్రీలో చాలా కొద్దిమందికే నిజమైన ఎథిక్స్, ధైర్యం ఉంటాయని ఆమె స్పష్టం చేసింది.కొంతమంది వ్యక్తుల ప్రవర్తనపై ఘాటుగా స్పందించిన రిచా, “తీవ్ర న్యూనతా భావంతో, సంకుచిత మనస్తత్వంతో బతికే వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. నేను అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో నా పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వారికి ప్రేమ దొరకలేదేమో.. అందుకే అలా తయారయ్యారు. నేను వారిని క్షమిస్తాను.. కానీ వారు చేసిన పనిని మాత్రం ఎప్పటికీ మర్చిపోను” అంటూ భావోద్వేగంగా స్పందించింది.
బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా కోలుకోవడానికి తాను ఊహించినదానికంటే ఎక్కువ సమయం పట్టిందని రిచా అంగీకరించింది. “బిడ్డను పెంచడానికి ఒక ఊరు మొత్తం కావాలంటారు. కానీ తల్లి తన సొంత గుర్తింపును తిరిగి నిర్మించుకోవడానికి కూడా అంతే బలమైన మద్దతు అవసరం” అని ఆమె వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలనే ఒత్తిడి, వ్యక్తిగత జీవితాన్ని ప్రదర్శనగా మార్చే కల్చర్ పట్ల కూడా ఆమె అసహనం వ్యక్తం చేసింది.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్లో తన నటనతో ప్రశంసలు అందుకున్న రిచా, మెటర్నిటీ బ్రేక్ తర్వాత పలు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండో-బ్రిటీష్ డ్రామా ‘ఐనా’ ద్వారా ఆమె అంతర్జాతీయ రంగంలోకి అడుగుపెట్టనుంది.