అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల బాస్ చంద్రబాబు (Chandrababu) చెప్పినట్లు ఆయన ఆడతారన్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో (Telangana Bhavan) బుధవారం ఆయన మాట్లాడారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ 5 ఫీట్లు ఎత్తు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారని చెప్పారు. అదే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు (Kaleshwaram Project) తాము రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ.లక్ష కోట్లు తిన్నారని ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.93 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్లు ఎలా తింటారని ఆయన ప్రశ్నించారు. బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, సొరంగ మార్గాలు, కాల్వలు, రిజర్వాయర్లు ఎవరు కట్టారన్నారు.
KTR | రైతులపై థర్డ్ డిగ్రీ..
నల్గొండలో యూరియా కోసం ధర్నా చేసిన యువ గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేటీఆర్(KTR) మండిపడ్డారు. కులం పేరుతో తిట్టి, ఇంట్లో నుంచి లాక్కెళ్లి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు నడవలేని స్థితిలో ఉన్నాడన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తామని చెప్పారు. దీని వెనకున్న ఎవరిని వదిలిపెట్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కూడా సంప్రదించాలని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి సూచించామన్నారు.
KTR | యూరియా బస్తా ఉంటే ధనవంతుడు
కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం భూమి ఉంటే ధనవంతుడని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అదే కాంగ్రెస్ పాలనలో ఒక్క యూరియా బస్తా ఉంటే ధనవంతుండనే పరిస్థితికి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.