ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్HYDRAA | వరమిచ్చిన హైడ్రా.. తీరిన ప్రగతినగర్​, బాచుపల్లి, మల్లంపేట వాసుల కష్టాలు

    HYDRAA | వరమిచ్చిన హైడ్రా.. తీరిన ప్రగతినగర్​, బాచుపల్లి, మల్లంపేట వాసుల కష్టాలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: HYDRAA | భాగ్యనగరం డెవలప్​మెంట్​ అంతా హైటెక్​ సిటీ కేంద్రంగా కొనసాగుతోంది. ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా.. దారులు మాత్రం అటువైపే అన్నచందంగా ఉన్నాయి.

    ఈ క్రమంలోనే హైటెక్​ సిటీకి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలతోపాటు కూకట్​పల్లి, కేపీహెచ్​బీ, మియాపూర్​ అభివృద్ధి చెందాయి.

    జేఎన్​టీయూ JNTU జనావాసాలు నిండిపోవడంతో నిజాంపేట్​, ప్రగతినగర్​, బాచుపల్లి, మల్లంపేట, సింహపురి కాలనీ వరకు ఆవాస ప్రాంతాలు విస్తరించాయి. ఇప్పుడు ఇవికూడా దాదాపు పూర్తిగా నిండిపోయాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

    ఇదిలా ఉండగా… మేడ్చల్​ Medchal జిల్లా దుండిగల్ Dundigal​ మండలం ఓ సమస్య గత కొన్నేళ్లుగా స్థానికులను వెంటాడింది. ఔటర్​ రింగ్​ రోడ్డు Outer Ring Road ఎగ్జిట్​ నంబరు 4 నుంచి ప్రగతినగర్​ వెళ్లాలంటే.. ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరు మల్లంపేట Mallampet, బాచుపల్లి Bachupally క్రాస్​ రోడ్డు మీదుగా వెళ్లాల్సి వచ్చేది.

    కాగా, ఇలా నిత్యం రద్దీతో వాహనదారులు అల్లాడేవారు. అయితే స్థానికంగా రెండు కాలనీల మధ్య ఓ అడ్డుగోడ ఉంది. దీనివల్ల మూడు కిలోమీటర్ల దారి కాస్త, 8 కిలోమీటర్లకు చేరింది. ఈ అడ్డుగోడ కూల్చివేస్తే.. సుమారు 25 వేల మంది ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే ఒకేసారి 5 కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది.

    HYDRAA | హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో..

    ఈ అడ్డుగోడ విషయంలో మల్లంపేట్ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ గోడను తొలగిస్తే 40 ‌‌- 60 అడుగుల వెడల్పుగల రహదారి మళ్లీ వినియోగంలోకి వస్తుందని వివరించారు. ఈ మేరకు హైడ్రా అధికారులు ఈ ఫిర్యాదును పరిశీలించారు. ఇందులో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    హైదరాబాద్ అర్బన్ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్​యూడీఏ) Hyderabad Urban Development Authority (HIUDA) ఆమోదం తెలిపిన లేఅవుట్ ప్రకారం ఈ ప్రాంతం గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించారు.

    కబ్జా చేసి, ఆక్రమించినట్లు తేలింది. రహదారులను అడ్డుకునేలా గోడలు నిర్మించకూడదని హెచ్ఎండీఏ HMDA నిబంధన 7లో స్పష్టంగా ఉంది.

    ఈ మేరకు ఈ గోడను హైడ్రా కూల్చివేసింది. స్థానికుల ఆశ నెరవేరేలా రహదారిని పునరుద్ధరించింది. ఫలితంగా సుమారు 25 వేల మందికి ప్రయోజనం చేకూరింది.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...