ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTiger | పెద్దపులి కోసం రెస్క్యూ ఆపరేషన్

    Tiger | పెద్దపులి కోసం రెస్క్యూ ఆపరేషన్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Tiger | రామారెడ్డి (Ramareddy) మండలం రెడ్డిపేట, అన్నారం, సిరికొండ మండలం తూంపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఓ ఆవుపై దాడి పెద్దపులి దాడి చేసింది. ఈ విషయాన్ని తండావాసులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు(Nizamabad Forest Officers) పెద్దపులి జాడ కోసం నిరంతరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

    మూడు కిలోమీటర్ల పరిధిలో పెద్దపులి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతం పెద్దదిగా ఉండడంతో సోమవారం ప్రత్యేక బెటాలియన్(Special Battalion)​ను అధికారులు రంగంలోకి దింపుతున్నారు. నాలుగైదు బృందాలుగా విడిపోయి పెద్దపులి కోసం రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) చేపట్టనున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరాలను తెప్పించి పెద్దపులి జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (Kawwal Tiger Reserve Forest) నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు.

    Tiger | మహారాష్ట్ర నుంచి..

    మహారాష్ట్ర తడోబా (Maharashtra Tadoba) నుంచి పెద్దపులి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దానికి ఎస్ 12గా పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. దాని వయసు నాలుగు నుంచి ఐదేళ్లు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెద్దపులి(Tiger) సంచరిస్తున్నట్టుగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో పులి స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    Tiger | పెద్దపులిపై విష ప్రయోగం!

    పెద్దపులిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. తండా శివారు(Thanda Shivaru)లో ఓ ఆవుపై పులి దాడికి యత్నించిన క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పులిపై గడ్డి మందు చల్లినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తిపై పులి చల్లాడా.. లేక ఆవు కళేబరంపై గడ్డి మందు పోశాడా అన్న విషయంపై స్పష్టత లేదు. విష ప్రయోగం చేసిన వ్యక్తి కూడా అటవీశాఖ అధికారుల కస్టడీలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కామారెడ్డి ఎఫ్​డీవో(Kamareddy FDO)ను వివరణ కోరగా మాచారెడ్డి ఎఫ్ఆర్​వో(Machareddy FRO) ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని తెలిపారు. విష ప్రయోగంపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...