అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | మండలంలోని సిర్నాపల్లి(Sirnapalli)లో కబ్జాకు గురైన స్థలాల్లో కట్టడాలను గ్రామాభివృద్ధి కమిటీ తొలగించింది. గతంలో నిరుపేదలకు గ్రామంలో ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చారు. రోడ్డు పక్కన ఉన్న స్థలాలను ఆక్రమించడంతో వీడీసీ సభ్యులు(VDC members), యూత్ సంఘ సభ్యులు(Youth Association members) శుక్రవారం అక్రమ కట్టడాలను తొలగించినట్లు తెలిపారు.
