Hydra Police Station | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో హైడ్రా పోలీస్​ స్టేషన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydra Police Station | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా(Hydra) ఏర్పాటుతో ఇప్పటికే చెరువులు, కుంటల్లోని ఆక్రమణలతో పాటు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం హైడ్రా పోలీస్​ స్టేషన్​(Hydra Police Station) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydra Police Station | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా(Hydra) ఏర్పాటుతో ఇప్పటికే చెరువులు, కుంటల్లోని ఆక్రమణలతో పాటు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం హైడ్రా పోలీస్​ స్టేషన్​(Hydra Police Station) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇక ఈ ఠాణాలోనే ప్రజలు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. గతంలో ఇతర పోలీస్ స్టేషన్​లలో నమోదైన భూకబ్జా కేసులు.. ప్రస్తుతం హైడ్రా ఠాణాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

Hydra Police Station | ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు

హైడ్రా పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​వో(SHO)గా ఏసీపీ స్థాయి అధికారి ఉండనున్నట్లు సమాచారం. ఔటర్​ రింగ్​ రోడ్డు లోపలి ప్రాంతం అంతా దీని పరిధిలోని రానుంది. ఓఆర్​ఆర్(ORR)​ లోపల ఎక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా అయినా ఈ ఠాణాలోనే కేసులు నమోదు చేయనున్నారు. దీని విస్తిర్ణం 2,053 చదరపు కిలో మీటర్లు ఉండనున్నట్లు సమాచారం.

Hydra Police Station | జాప్యాన్ని నివారించేందుకు..

ప్రభుత్వ భూములు, కుంటలు, రోడ్లు, చెరువుల ఆక్రమణలపై కేసులను ప్రస్తుతం ఇతర పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. అయితే ఇతర కేసులతో బిజీగా ఉండే పోలీసులు(Police) వాటిపై త్వరగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఆ కేసుల దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు హైడ్రా పోలీస్​ స్టేషన్​(Hydra Police Station)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఈ ఠాణాలో ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీ) కింద కేసులు నమోదు చేయాలని హైడ్రా యోచిస్తోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...