అక్షరటుడే, వెబ్‌డెస్క్: reduced tariffs | భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ Trump శుభవార్త తెలిపారు. యూఎస్ విధించిన టారిఫ్‌లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. ‘ఈ రోజు భారత్ PM నరేంద్ర మోడీతో మాట్లాడాను.. మోడీ నాకు గొప్ప స్నేహితుడు.. ఆయన శక్తిమంతమైన నేత. రష్యన్ నుంచి చమురు కొనుగోలును నియంత్రించడానికి.. US, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన ఒప్పుకొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది’ అని సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌లో ట్రంప్ పోస్టు చేశారు.
మోడీ ధ్రువీకరణ..
భారత్ India -యూఎస్ US వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని మోడీ నిర్ధారించారు. ఈ మేరకు X (ట్విట్టర్)లో మోడీ పోస్ట్ చేశారు. “నా స్నేహితుడు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడటం గొప్పగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ప్రొడెక్ట్స్‌పై ఇకపై తగ్గిన 18 శాతం పన్ను ఉంటుంది. ఇది సంతోషకరం. ఈ అద్భుతమైన నిర్ణయం వెల్లడించినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరఫున ట్రంప్‌నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య కంట్రీలు కలిసి పనిచేసినప్పుడు, అది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వం ఎంతో ముఖ్యమైనది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతుగా నిలుస్తుంది. మా ఇద్దరి భాగస్వామ్యాన్ని అపూర్వమైన ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను..” అని పోస్ట్‌లో మోడీ వర్ణించారు.