ePaper
More
    Homeటెక్నాలజీRedmi K80 Ultra | రెడ్‌మీ కే80 అల్ట్రా లాంచ్.. గేమింగ్‌, ఫొటోగ్రఫీ ప్రియులకు పర్‌ఫెక్ట్...

    Redmi K80 Ultra | రెడ్‌మీ కే80 అల్ట్రా లాంచ్.. గేమింగ్‌, ఫొటోగ్రఫీ ప్రియులకు పర్‌ఫెక్ట్ మొబైల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Redmi K80 Ultra | రెడ్‌మీ అభిమానుల కోసం శావోమి మరోసారి సరికొత్త టాప్-ఎండ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. చైనా మార్కెట్లో (Redmi K80 Ultra) అధికారికంగా విడుదలైంది. అత్యాధునిక ఫీచర్లతో, గేమింగ్ ప్రదర్శన కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు టెకీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకతలు చూస్తే.. ఈ ఫోన్‌కు MediaTek Dimensity 9400+ (3nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ పవర్ ఇస్తుంది. 16GB వరకు LPDDR5x RAM, 1TB వరకు UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజీ అందుబాటులో ఉంటుంది. HyperOS 2 ఆధారిత Android 15పై రన్ అవుతుంది.

    డిస్‌ప్లే & డిజైన్: 6.83 అంగుళాల 1.5K OLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్, 2560Hz PWM డిమ్మింగ్ సపోర్ట్, Xiaomi Shield గ్లాస్ ప్రొటెక్షన్, IP68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్

    కెమెరా సెటప్: 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 20MP సెల్ఫీ కెమెరా (హోల్-పంచ్ కట్‌అవుట్‌తో)

    బ్యాటరీ & ఛార్జింగ్: 7,410mAh బిగ్​ బ్యాటరీ, 100W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్

    కనెక్టివిటీ & ఫీచర్లు: 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C , In-display ఫింగర్ ప్రింట్ స్కానర్, GPS, A-GPS, NavIC ,

    బరువు: 219 గ్రాములు

    సైజ్: 163.08×77.93×8.18 mm

    ధరలు (చైనాలో): 12GB + 256GB: ¥2,599 (సుమారు ₹31,000), 12GB + 512GB: ¥2,999 (సుమారు ₹35,800), 16GB + 256GB: ¥2,799 (సుమారు ₹33,400), 16GB + 512GB: ¥3,299 (సుమారు ₹39,400), 16GB + 1TB: ¥3,799 (సుమారు ₹45,400)

    క‌లర్ ఆప్షన్లు: ఐస్ బ్లూ, స్ప్రూస్ గ్రీన్, శాండ్ స్టోన్ యాష్, మూన్ రాక్ వైట్

    Redmi K80 Ultra ప్రస్తుతం చైనాలో మాత్రమే లభ్యమవుతోంది. గ్లోబల్, ఇండియన్​ మార్కెట్స్​లో ఇది Xiaomi 14T Proగా లేదా మరో పేరుతో విడుదలయ్యే ఛాన్స్​ ఉంది. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, మంచి ప‌ర్‌ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది పర్​ఫెక్ట్​ ఛాయిస్ కానుంది.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...