అక్షరటుడే, ఇందూరు : Red Cross Society | నిజామాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని (MLA Sudarshan Reddy) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనకు నోట్ పుస్తకాలు అందజేశారు.
Red Cross Society | కలెక్టర్‌కు శుభాకాంక్షలు..
అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు కలెక్టర్ ఇలా త్రిపాఠిని (Collector Ila Tripathi) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కలెక్టర్‌కు తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవీందర్, జూనియర్ రెడ్‌క్రాస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, కార్యదర్శి వరుణ్ బాబు, మోపాల్ మండల ఛైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
