అక్షరటుడే, వెబ్‌డెస్క్: Punjab target is 191 : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ రెండు జట్లు ఫైనల్ రావడంతో ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్ అవతరించబోతుంది. ఆర్‌సీబీకి ఇది నాలుగో ఫైనల్ కాగా.. పంజాబ్ కింగ్స్‌కు రెండోది. గతంలో ఆర్‌సీబీ 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ కోల్పోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్లో కేకేఆర్ Kkr చేతిలో ఓటమిపాలైంది. ఇక ఐపీఎల్ ఫైనల్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశభక్తి ఉప్పొంగేలా సాగడం విశేషం.. భారత సాయుధ బలగాల వీరత్వానికి, వారి సేవలకు అంకితం చేశారు.
IPL 2025 RCB vs PBK : ఏం చేస్తారో..
సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ shankar mahadevan భారత సాయుధ బలగాలకు నివాళి అర్పిస్తూ అద్భుతమైన సంగీత ప్రదర్శన ఇచ్చారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రదర్శకు ముందు ఆయన ‘ఆపరేషన్ సిందూర్’ ను గుర్తు చేసుకున్నారు. ‘ఏ వతన్’, ‘లెహ్రా దో’, ‘కంధో సే మిల్తే హై కదమ్’ వంటి దేశభక్తి గీతాలను ఆలపించారు. స్టేడియం ప్రాంగణంలో దేశభక్తిని ఉప్పొంగించారు. ప్రేక్షకులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడించారు. సాయుధ బలగాల పరాక్రమానికి సెల్యూట్ కొట్టారు. ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు బిగ్ బ్రేక్ లభించింది. ఆర్సీబీ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(16)ను జేమీసన్ ఔట్ చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జోరు మీదున్న సాల్ట్‌ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడీ పేసర్.
లాంగాఫ్‌లో అతడు గాల్లోకి లేపిన బంతిని గమనిస్తూ వెనక్కి పరుగెత్తిన శ్రేయాస్ అయ్యర్ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 18 వద్ద తొలి వికెట్ పడింది. ఆ తర్వాత మయాంక్ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి ఔటయ్యాడు. 18 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ(13), మయాంక్ అగర్వాల్(24), లివింగ్ స్టోన్ ( 25), జితేష్ శర్మ ( 24), షెపర్డ్ ( 17 ), కృనాల్ పాండ్యా ( 4), భువనేశ్వర్ ( 1) పరుగులు చేశారు.ఇక ఆర్సీబీ rcb 20 ఓవర్లు ముగిసే సరికి పది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్స్ లో అర్షదీప్-3, జైమీసన్-3, ఒమర్జాయ్, వైశాఖ్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. ఇక పంజాబ్ విజయానికి 191పరుగులు కావాల్సి ఉంది.