HomeసినిమాVijay - Rashmika | కొత్త ఆరంభం.. గ‌తంలో ర‌ష్మిక‌కి వేరే వ్య‌క్తితో నిశ్చితార్థం.. విజ‌య్‌తో...

Vijay – Rashmika | కొత్త ఆరంభం.. గ‌తంలో ర‌ష్మిక‌కి వేరే వ్య‌క్తితో నిశ్చితార్థం.. విజ‌య్‌తో ప్రేమ ఎలా మొద‌లైంది?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vijay – Rashmika | టాలీవుడ్‌లో గ‌త కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట ఇక తమ రిలేషన్‌షిప్‌కి అఫీషియల్ ముద్ర వేసారు. అక్టోబర్ 3న, శుక్రవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ నిశ్చితార్థం(Engagement) చేసుకున్నారు.

దీంతో అభిమానులు ఊహించినదే నిజమైంది. వీరి ప్రేమ కథ చివరకు పెళ్లి వరకూ చేరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది. అంతేకాకుండా, ఈ వివాహ వేడుకను డెస్టినేషన్ వెడ్డింగ్‌(Destination Wedding)గా నిర్వహించనున్నారు. అయితే విజయ్ – రష్మిక మధ్య బాంధవ్యానికి బీజం పడింది 2018లో విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా సమయంలోనే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ‘డియర్ కామ్రేడ్’ (2019) సినిమాలో కూడా జంటగా కనిపించి మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

Vijay – Rashmika | రష్మిక గత నిశ్చితార్థం

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో పరిచయం కంటే ముందే రష్మిక తన మొదటి కో–స్టార్ అయిన కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాలతో ఆ బంధం విఫలమైంది. ఆ తర్వాత రష్మిక(Rashmika Mandanna) తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. విజయ్, రష్మిక తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ ఓపెన్‌గా చెప్ప‌లేదు . కాని వారికి సంబంధించిన విషయాలు నెటిజన్లకు క్లారిటీ ఇచ్చాయి. ప్రత్యేకించి 2023 న్యూ ఇయర్ లైవ్ సెషన్‌లో రష్మిక వీడియోలో విజయ్ వాయిస్ వినిపించిందన్న కామెంట్లు వైరల్ అయ్యాయి.

నిశ్చితార్థం తర్వాత వీరి పెళ్లిపై ఆసక్తి మరింత పెరిగింది. వచ్చే ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్గా ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. స్టార్ జంట పెళ్లి కాబట్టి, సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖుల హాజరుతో ఇది గ్రాండ్ ఈవెంట్ కానుంది. ఈ న్యూస్ విన్న త‌ర్వాత అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది “ఫైనల్లీ” అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీల్ లైఫ్ లవర్స్, ఇప్పుడు రియల్ లైఫ్ కాపుల్స్ గా మారిన విజయ్ – రష్మికల కొత్త జీవితం ఆనందంగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.