HomeUncategorizedRashmika Mandanna | వామ్మో.. ర‌ష్మిక ఇలా భ‌య‌పెట్టేస్తుంది ఏంటి.. గ‌తంలో ఎప్పుడు ఇలా చూడ‌లేదుగా..!

Rashmika Mandanna | వామ్మో.. ర‌ష్మిక ఇలా భ‌య‌పెట్టేస్తుంది ఏంటి.. గ‌తంలో ఎప్పుడు ఇలా చూడ‌లేదుగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rashmika Mandanna | పాన్‌ ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి ఓ విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ‘మైసా’ అనే కొత్త సినిమాతో మరోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.. కొద్ది సేప‌టి క్రితం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రష్మిక నటిస్తున్న ఈ సినిమా, ఆమె కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రష్మిక(Rashmika Mandanna) గోండ్ తెగ మహిళగా క‌నిపిస్తుంది. చేతిలో ఆయుధంతో, ఉగ్రతతో నిలబడి ఉన్న ఆమె లుక్ అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉంది.

Rashmika Mandanna | భ‌య‌పెట్టిస్తుంది..

పోస్టర్‌పై కనిపించిన అనే ట్యాగ్ లైన్ సినిమాపై అంచ‌నాలు పెంచింది. ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు ఏమాత్రం కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు. భయపెట్టేందుకు అని మేక‌ర్స్ చెప్ప‌డంతో ర‌ష్మిక పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రం గోండ్ తెగ(Gond Tribe)కి సంబంధించిన వారి జీవితం, సమస్యలు, పోరాటాల ఆధారంగా రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పాత్ర ఆమెకు ఇప్పటివరకు చేసిన వాటితో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ సినిమాతో రవీంద్ర పుల్లే అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. హను రాఘవపూడికి అసిస్టెంట్‌(Hanu Raghavapudi)గా పనిచేసిన ఆయన, ఈ కథను రెండేళ్లుగా తయారుచేస్తున్నట్లు వెల్లడించాడు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ధనుష్(తమిళం), విక్కీ కౌశల్ (హిందీ), దుల్కర్ సల్మాన్ (మలయాళం), శివరాజ్ కుమార్ (కన్నడ), హను రాఘవపూడి (తెలుగు) లాంటి స్టార్లు రిలీజ్ చేయడం విశేషం. ఇది రష్మిక సినిమాకు ప్రత్యేకమైన హైప్ తెచ్చిపెట్టింది. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్(Un Formula Films) నిర్మిస్తుండగా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో చిత్రం రూపొందుతుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. సోలో వారియర్‌గా రష్మిక కనిపించనున్నారని ఫస్ట్ లుక్ బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు. ఈ చిత్రం కూడా ర‌ష్మిక‌కి మంచి సక్సెస్ అందించ‌డం ఖాయం అంటున్నారు. ‘మైసా’(Maisa) సినిమాతో రష్మిక పూర్తిగా కొత్త కోణాన్ని ఆవిష్క‌రించ‌నుంది. ఫస్ట్ లుక్, కథా నేపథ్యం, పోరాట గాధతో ఈ సినిమా తెలుగు పరిశ్రమలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ ప్రయోగాత్మక కథ రష్మిక కెరీర్‌ను ఇంకెన్ని మెట్లు ఎక్కిస్తుందో వేచి చూడాలి.