అక్షరటుడే, హైదరాబాద్: Ramreddy Damodar Reddy | మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
దామోదర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరారు. కానీ, పరిస్థితి విషమించి ఆయన మరణించారు.
Ramreddy Damodar Reddy | ఐదుసార్లు ఎమ్మెల్యేగా..
సూర్యాపేట జిల్లా Suryapet district తుంగతుర్తి Tungaturthi లో శుక్రవారం దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే MLA గా గెలుపొందారు. ఓసారి మంత్రి MINISTER గా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు.